- కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ట, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ట, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదని మండిపడ్డారు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డిది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్ధామని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదేనని విమర్శించారు.
సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ముందు ఉన్న విగ్రహాన్ని చూసుకోవడం చేదకానీ బాపు ఘాట్ పునరుద్ధరిస్తామని బడాయి కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుందన్నారు. నాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం.. నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధకరమని చెప్పారు. ఓ మహాత్మా మన్నించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
‘అక్టోబర్ 2, 2022 గాంధీ జయంతిని పురస్కరించుకొని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ గారు గాంధీ ఆసుపత్రి ముందు ఆవిష్కరించిన గాంధీ గారి కాంస్య విగ్రహం ఇది. కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సిఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారు. గాంధీ పేరు చెప్పి రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప, ఆయన పట్ల, ఆయన సిద్ధాంతాల పట్ల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది గాంధీ గారి సిద్ధాంతం అయితే, రేవంత్ రెడ్డి ది చెడు విను, చెడు చూడు, చెడు మాట్లాడు అనే సిద్దాంతం. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆయన అనుసరిస్తున్న మూల సూత్రం ఇదే.
గాంధీ ఆశయాలే పట్టని కాంగ్రెస్ పార్టీకి, గాంధీ విగ్రహం ఎలా కనిపిస్తుంది. ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకోవడం చేత కాదు, కానీ బాపు ఘాట్ పునరుద్దరిస్తమని బడాయి కొడుతున్నడు. ఆనాడు ఎంతో ఆడంబరంగా ఆవిష్కరించుకున్న గాంధీ విగ్రహం, నేడు నిర్వహణ లేక ఈ స్థితిలో ఉండటం బాధాకరం. ఓ మహాత్మా మన్నించు!’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
