- Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరోజు కూడా నీటి కష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాకముందే.. నీళ్ల కష్టాలు మొదలయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరోజు కూడా నీటి కష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాకముందే.. నీళ్ల కష్టాలు మొదలయ్యాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు మొలయ్యాయని హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. వేసవి రాకముందే బోర్లు ఎండిపోతున్నాయి. ప్రజలు డబ్బులు పెట్టి వాటర్ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకు ముందెప్పుడూ హైదరాబాద్‌లో ఇలాంటి తాగునీటి సంక్షోభం రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదికే పరిస్థితి విషమించింది. దేశంలోనే భూగర్భ జలాలు భారీగా క్షీణించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. సామాన్యులు నీటి ట్యాంకర్ల కోసం భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని ఊదరగొట్టుకోవడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించాం. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడులు దుంకినయి. కాంగ్రెస్ పాలనలో చెరువులు ఎండిపోతున్నాయి. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో మునిగిపోయింది. పాలనపై శ్రద్ధ పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలలో బిజీగా ఉన్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
