- Harish Rao | సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించగానే.. హరీశ్‌రావు తన గళాన్ని విప్పారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. జగదీశ్ రెడ్డిని ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించగానే.. హరీశ్‌రావు తన గళాన్ని విప్పారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు సర్.. మీరు ప్రధాన ప్రతిపక్షానికి మీరు మైక్ ఇవ్వరా సర్ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సభలో మాట్లాడేందుకు మాకు ఎందుకు అవకాశం ఇవ్వరని హరీశ్‌రావు సభాపతిని ప్రశ్నించారు.
మంత్రులు వెకిలి నవ్వులు..
ఇక హరీశ్‌రావు స్పీకర్‌ను ప్రశ్నిస్తుండగానే.. బీజేపీఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక కాంగ్రెస్ సభ్యులు ముసిముసి నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు వెకిలి నవ్వులు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు.
కేసీఆర్ ఛాంబర్‌లో జగదీశ్ రెడ్డి..
స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన జగదీశ్ రెడ్డి కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అక్కడ్నుంచి కూడా వెళ్లిపోవాలని చీఫ్ మార్షల్ జగదీశ్ రెడ్డికి సూచించారు. సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ సభ్యులు చీఫ్ మార్షల్‌కు సూచించారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.
