Warangalvoice

GHMC Politics: New politics in GHMC.. This is the BRS plan..

GHMC Politics: జీహెచ్ఎంసీలో కొత్త రాజకీయం.. బీఆర్ఎస్ ప్లాన్ ఇదే..

  • Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

వరంగల్ వాయిస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాస కత్తి వేలాడుతోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తుందనేది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఏ క్షణంలోనైనా మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. నెంబర్ గేమ్‌ను బట్టి మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం ఉంటుందని తెలిపారు. బీసీ మూవ్‌మెంట్ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన కులగణన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ చేసిన సర్వేలో బీసీలు 51శాతం మంది ఉన్నారన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 90శాతం మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలున్నారని చెప్పారు. రాష్ట్రంలో 60లక్షల మందికి లెక్కలు లేవన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అసెంబ్లీలో చట్టం చేసి 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీలు ఒప్పుకోరని చెప్పుకొచ్చారు. పునర్విభజన జరిగితే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు తెలంగాణకు తగ్గుతాయన్నారు. ప్రభుత్వం రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొంటారని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేశాక రేవంత్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్

GHMC Politics: New politics in GHMC.. This is the BRS plan..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *