- Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు.
వరంగల్ వాయిస్, బోధన్ రూరల్ : నిజాంసాగర్ (Nizamsagar ) కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను ( Irrigation Officers ) రైతులు (Farmers) నిర్బంధించారు. నిజాంసాగర్ డి 28 కెనాల్ లో నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు కెనాల్‌ను పరిశీలించడానికి శుక్రవారం గ్రామానికి వచ్చారు.
దీంతో ఆగ్రహించిన రైతులు నిజాంసాగర్ కెనాల్ నీటిని విడుదల చేసి వారం రోజులు కావస్తున్న కింది ఆయకట్టుకు నీళ్లు రాకపోవడంతో రైతులు ఇరిగేషన్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. నిజాంసాగర్ కెనాల్ నీరు చివరి ఆయకట్టు వరకు అందకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో తాళం వేశామని రైతులు చెప్పారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ సీఐ విజయబాబు, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి, సంఘటన స్థలాన్ని చేరుకొని రైతులతో మాట్లాడి సముదాయించారు.
