- విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- కలెక్టర్ కు లంబాడి హక్కుల పోరాట సంఘం వినతి
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎస్టీ లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్న గోపు స్వర్ణలతపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవేండి గ్రామానికి చెందిన గోపు బాలశౌర్ రెడ్డి 1963 లో కడవేండి చర్చిలో గోపు సుశీలను వివాహం చేసుకున్నారు. వారికి హేమలత, స్వర్ణలత ఇద్దరు కూతుర్లు. గోపు సుశీల వ్యక్తిగత కారణాలతో ఇద్దరు కూతుర్లతో ఖాజిపేటకు వచ్చి ఫాతిమా నగర్ లో కిరాయి ఉంటూ జీవనం సాగిస్తోంది. అనంతరం గోపు సుశీల భూక్యా అంకుష్ వీధిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ ఆయనతో స్నేహంగా మెగిలారు. అయితే రఘునాథ్ పల్లి స్కూల్ లో గోపు స్వర్ణలత చదివినప్పుడు తండ్రి పేరు గోపు బాలశౌర్ రెడ్డిగా పేర్కొన్న సుశీల ఫాతిమా గర్ల్స్ హై స్కూల్ లో మాత్రం తండ్రి పేరును భూక్యా అంకుష్ అంటూ తప్పుగా నమోదు చేశారని ఆరోపించారు. అప్పుడే స్వర్ణలత పేరు మీద రెవెన్యూలో ఎస్పటీ సర్టిఫికెట్ పొంది అక్రమ మార్గంలో రిజర్వేషన్ పొంది చదువు పూర్తి చేశారని, తర్వాత అదే సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అందనినీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తగు విచారణ చేసి కులాన్ని తప్పుగా రికార్డుల్లో చూపిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అమెకిచ్చిన ఎస్టీ సర్టిఫికెట్ రద్దు చేయాన్నారు. లేకుంటే లంబాడా హక్కుల సంఘం ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు చేపడతామని కలెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు లావుడియా శ్రీనివాస్ నాయక్, సురేష్ నాయక్, గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.