Warangalvoice

Damodar Rajanarasimha Ordered Officials To Complete The Construction Work Of Medical Colleges Quickly

Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

  • Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

వరంగల్ వాయిస్,  హైదరాబాద్‌ : నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే విద్య సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మెడికల్ కాలేజీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.
నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫేర్ కమీషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంస్‌ఐడీ ఎండీ హేమంత్, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, నిమ్స్‌ డైరక్టర్ డా. బీరప్ప, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Damodar Rajanarasimha Ordered Officials To Complete The Construction Work Of Medical Colleges Quickly
Damodar Rajanarasimha Ordered Officials To Complete The Construction Work Of Medical Colleges Quickly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *