- CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు.
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే ఆయా పార్టీలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవని అన్నారు.
అదే సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానంతో మాట్లాడి సానుకూలంగానే స్పందించారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ పాల్గొన్నారు.
