Warangalvoice

CM Revanth Reddy: Another milestone in Hyderabad's development.. CM Revanth's key comments

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

  • CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని గర్వంగా చెబుతున్నానని అన్నారు.

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయి అని చెప్పారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ విస్తరణలో భాగంగా నూతన భవనాన్ని ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌తో తమ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని తెలిపారు. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని ఉద్ఘాటించారు. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పెట్టుబడి తమ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్‌వర్క్ యాక్సెస్‌ను చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: Another milestone in Hyderabad's development.. CM Revanth's key comments
CM Revanth Reddy: Another milestone in Hyderabad’s development.. CM Revanth’s key comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *