పట్టు పట్టి.. కొలువు కొట్టు
అంకితభావంతో చదివితేనే అందలంమీ భవిష్యత్ కు మీరే మార్గనిర్దేశకులుప్రణాళిక, సమయ పాలన అవసరంరాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథినల్గొండ జిల్లా కేంద్రంలోఉద్యోగార్థులకు అవగాహన సదస్సు
‘‘మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. ప్రణాళికా బద్ధంగా, సమయ పాలన పాటిస్తూ కసిగా కష్టపడితే ప్రభుత్వ కొలువు సాధించడం కష్టమేమి కాదు.. బద్దకం, వాయిదా వేయడం, నిరాశ, , ఆత్మన్యూనతా వంటి లక్షణాలు విడనాడాలి.. పాజిటివ్ దృక్పథంతో ముందుకు నడువాలి’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథి ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థ సారథి మాట్లాడుతూ.. బుక్ స్టాల్ లో కనపడే ప్రతీ పుస్తకం కొనవద్దని, ఒక సబ్జెక్ట్ కు ఒకే ప్రామాణిక పుస్తకాన్ని చదివి నోట్స్ రాసుకోవాలన్నారు. దాన్ని పదే పదే రివిజన్...









