- BRS Dharna | ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
వరంగల్ వాయిస్, బాన్సువాడ : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ అన్నారు. బీఆర్‌ఎస్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ శ్రేణులు శనివారం ధర్నా నిర్వహించి అంబేద్కర్‌చిత్రపటానికి అందజేశారు.
ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, సీ ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయం లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, 15 నెలల్లో ప్రజలకు ఒరుగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన పెన్షన్ పెంపు హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తే జగదీష్ రెడ్డిని అన్యాయంగా సస్పెన్షన్ చేశారని ఆరోపించారు.
కల్యాణ లక్ష్మి ద్వారా లక్ష నగదులో పాటు తులం బంగారం ఇస్తామన్నా హామీని ఎందుకు నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి , కేసీఆర్ పై చేసిన అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అన్నారు. కేసీఆర్ అప్పులు చేశారని లెక్కలు చూపుతున్నారని, తెచ్చిన అప్పులతో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, మిషన్ కాకతీయ పథకంలో చెరువుల పునరుద్ధరణ , పంట పొలాలకు సాగు నీరు , కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు
15 నెలల కాలంలో నే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసిజేబులు నింపుకున్నదని ఆరోపించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీఆర్‌ఎస్ నాయకులు మోచి గణేష్ , సాయిబాబా, గౌస్, చాకలి మహేష్, సాయిలు, మౌలా, సద్దాం, శివసూరి, రమేష్ యాదవ్, శంకర్, తదితరులు ఉన్నారు.
