- Brahmanandam | ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు.
వరంగల్ వాయిస్, హనుమకొండ : ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు శాల్తీ లేచిపోతుంది.. అంటూ హాస్యనటుడు డాక్టర్ కె.బ్రహ్మానందం విద్యార్థులను ఉత్సాహపరిచారు. వరంగల్ నిట్లో(Warangal NIT) స్ప్రింగ్ స్ప్రి 2025 ప్రారంభించి మాట్లాడారు. చాలా పేదరికం నుంచి ఎన్నో అడ్డంకులు, అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి, డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం ఎంతో కష్టపడి చదివారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లెక్చరర్ గా చేసినప్పటికీ నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచించగా సినిమాల్లో నటించే అవకాశం రాగా ఒక్కో అడుగు వేస్తూ ఒడిసి పట్టుకున్నానని తెలిపారు.
నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం ఇస్తారు. కృషి, పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైఫ్ ఈజ్ ఏ గేమ్.. వి షుడ్ హావ్ టు ప్లే అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. 40 ఏళ్ల సినీ పరిశ్రమలో 1200 పైగా చిత్రాల్లో నటించాను. ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసిన వ్యక్తి గా నిలిచిపోయానని పేర్కొన్నారు. పద్మశ్రీ అవార్డు, డాక్టరేట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాను. అందరూ బ్రహ్మా ‘ఆనందంగా’ఉండాలి, మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనలు వస్తాయని విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపారు
