- భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు.
వరంగల్ వాయిస్, భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కిందపడి చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కుల సంఘాలు, వామపక్ష, కుల సంఘా నాయకులు, తాపీమేస్త్రి ఉపేందర్ బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మృతదేహాలకు పోస్టుమార్టం చేయాలని ప్రభుత్వ దవాఖాన మార్చురీ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకుని తాపీమేస్త్రి ఉపేందర్, కార్మికుడు కామేశ్వర్‌రావు మృతిచెందారు. గురువారం శిథిలాల్లో చిక్కుకుపోయిన తాపీమేస్త్రి కామేశ్వర్‌రావును అధికారులు ప్రాణాలతో బయటకుతీశారు. కానీ అప్పటికే కాలు, చెయ్యి నుజ్జునుజ్జయి, తీవ్ర రక్తస్రావం జరిగిన కామేశ్వర్‌రావు దవాఖానకు తరలించిన వెంటనే ప్రాణాలు వదిలాడు. శుక్రవారం ఉదయం ఉపేందర్ మృతదేహాన్ని శిథిలాల కిందినుంచి రెస్క్యూ సిబ్బంది వెలికి తీసింది. పోస్టుమార్టం అనంతరం ఉపేందర్ డెడ్‌బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
