- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు.
వరంగల్ వాయిస్, పీర్జాదిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి, క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మి (Bala Lakshmi) అన్నారు. మంగళవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, వార్డు అధికారులకు కుల గణనపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రెష్ యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల గణన సర్వేకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, ఈ సర్వేలో పాల్గొని వారి కుటుంబ సభ్యుల పేర్లు రీ సర్వేలో నమోదు చేసుకోవాలన్నారు. తదితర అంశాలపై ఎమ్యూనరెటర్లు, వార్డ్ అధికారులకు సర్వేకు సంబంధించిన దిశ నిర్దేశం చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ రావు అధికారులు పాల్గొన్నారు.
