Warangalvoice

Author: Sahith Gaddam

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Political

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డే క్రమశిక్షణ తప్పాడని ఆయ‌న పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మేఘా రెడ్డిపై బహిరంగంగా ఆరోపణలు చేశాడు.. మరి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిపై క్రమశిక్షణ చర్యలు ఉండవా? అని ప్ర‌శ్నించారు. కులగణన మీద బీసీ నాయకులతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే దానికి జానారెడ్డిని, కేశవరావును పిలిచారు కానీ బీసీ నాయకుడినైనా...
CPI | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ బృందం
District News

CPI | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ బృందం

CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది తప్పితే ఆయా పార్టీలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల విధానాలు ప్రతిబింబించవని అన్నారు. అదే సందర్భంగా కాంగ్రెస్, సీపీఐల మధ్య 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామన్...
Minister Seethakka: తీన్మార్ మల్లన్నది ఆ స్థాయి కాదు.. మంత్రి సీతక్క ఫైర్
Political

Minister Seethakka: తీన్మార్ మల్లన్నది ఆ స్థాయి కాదు.. మంత్రి సీతక్క ఫైర్

Minister Seethakka: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వరంగల్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. ...
Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
Today_banner

Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వరంగల్ వాయిస్,  హైదరాబాద్‌ : నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే విద్య సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, ఫ్యామిలీ వెల్ఫ...
Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్
Today_banner

Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్

Teenmar Mallanna: ముఖ్యమంత్రి టార్గెట్‌ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ తననుసస్పెండ్ చేయించారు అంటూ మల్లన్న కామెంట్స్ చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ... తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించి రేవంత్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశారని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో.. చూస్తామన్నారు. ‘‘నన్ను సస్పెండ్ చేస్తే.. బీసీ ఉద్యమం ఆగిపోతుందన్న భ్రమలోంచి రేవంత్ బయటకు రావాలి. నాలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే కుల గణనను తప్పుగా చూపారు. 90 ఏళ...
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు
Political

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు

Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. భూముల వేలంపై మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని చూసి ఊసరవెల్లి సైతం ఉరి వేసుకునే పరిస్థితి నెలకొన్నది అని విమ‌ర్శించారు. ‘‘ప్రభుత్వ భూములంటే పెద్దలిచ్చిన ఆస్తి అని, తెలంగాణ జాతి సంపద అని, ఆ భూములను అమ్మితే భవిష్యత్తులో స్మశానాలు నిర్మించాలంటే కూడా భూమి లేకుండా పోతుందని’’ నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కార్చిండు. తాము అధిక...
KTR | మ‌ల్క‌పేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చ‌రిక‌కు క‌దిలిన యంత్రాంగం
Today_banner

KTR | మ‌ల్క‌పేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చ‌రిక‌కు క‌దిలిన యంత్రాంగం

KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్ కుమార్ చాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. కేటీఆర్ హెచ్చరించడంతో యంత్రాంగం క‌దిలింది. మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి...
Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
Political

Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు నుంచి త‌మ‌కు నోటీసులు రాలేద‌ని ప్ర‌తివాదుల త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. ప్ర‌తివాదుల వాద‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ అగ‌స్టిన్ జార్జ్ ధ‌ర్మాస‌నం.. రాష్ట్ర ప్ర‌భుత్వం, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌హా ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు జారీ చేసింది. పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25వ తేదీకి ధ‌ర్మాస‌నం వాయిదా వేసిం...
Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం
Today_banner

Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం

మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వాయిస్, మొయినాబాద్‌ : మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో శత సప్త చండీయాగం నిర్వహించారు. అనంతరం మహిళలతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని కన్నుల విందుగా నిర్వహించారు. వార్షికోవత్సంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. హోమం కార్యక్రమాన్ని ఆదాయ పన్ను శాఖ మాజీ అధికారి రాములు, కె మల్లేశ్‌ గౌడ్‌ దంపతుల చేత...
TG Cabinet | ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana

TG Cabinet | ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ

TG Cabinet | ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ప‌లువురు అధికారులు హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం....