వరంగల్ వాయిస్, హనుమకొండ: హనుమాన్ నగర్ లోని జై హనుమాన్ పరపతి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కందికొండ సదానందం మాట్లాడుతూ మన దేశానికి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చిందని, మన దేశ ప్రజలు నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో మన దేశం ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆత్మకూరు దేవేంద్ర చారి
మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల కష్టాన్ని త్యాగాన్ని మన ప్రతి ఒక్క భారతీయుడు ఎల్లప్పుడూ మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల సూర్యనారాయణ, ఉప్పుల రాజు, సముద్రాల రాజేష్, కుంటి మురళీధర్, ధోనికల సుమన్, మట్టేవాడ చంద్రమౌళి, పోతుల ప్రవీణ్, మాటూరి ప్రసాద్, పి మండ నాగరాజు, నరసింహ చారి, మెరుగు రాజేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.