వరంగల్ వాయిస్, కేయూ : ఈ నెల 31న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్ కరపత్రాన్ని యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణంలో శుక్రవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరాపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైన ఉద్యోగాల ప్రకటన చేసి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి అందులో భాగంగా 17,516 ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం ఈ మెగా మోడల్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రిటైర్డ్ పోలీస్ అధికారుల చేత, ఉత్తమ అధ్యాపకుల చేత ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తున్నామని, ఈ మోడల్ టెస్ట్ ను నిరుద్యోగ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు గొల్లపెల్లి వీర స్వామి, ఆర్ట్స్ కళాశాల ప్రెసిడెంట్ దగ్గుల వినోద్, నాయకులు రమేష్, సాయి, మనోజ్, క్రాంతి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
