ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవము ఏప్రిల్ 25న
ప్రపంచ మలేరియా దినోత్సవాని 2007 ఏప్రిల్ 25న ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ దేశాన్ని కలిసి ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియా కారకాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి పొందిన రోనాల్డ్ రాస్ తన పరిశోధనలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు అంతే స్థాయిలో డాక్టర్ మల్లన్న క్లోరోఫామ్ ఇచ్చే పద్ధతులపై విశేషమైన పరిశోధన చేశారు. సమాజ సేవతో పాటు హైదరాబాద్‌లో వైద్య రంగంలో తనకంటూ పేరు సంపాదించుకుని అనేక వ్యాధులకు ఖచ్చితమైన నివారణ పద్ధతులను కనుగొన్న ఆయన తెలంగాణ ప్రజలందరికి ఆదర్శమూర్తి. తన తండ్రి ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న కాలంలో మధ్యప్రదేశ్లో 1872 అక్టోబర్ 26న మల్లన్న జన్మించారు. తండ్రి రిటైరయిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్పటికే మెడికల్ విద్యకు ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌లోని హైదరాబాద్ మోడికల్ స్కూల్ నుంచి 1892లో 20ఏళ్ళ వయస్సులో పట్టాపొందారు. హైదరాబాద్ మెడికల్ స్కూల్ (కాలేజీ)లో పాథాలజీ లెక్కరర్‌గా కూడా ఆయన పనిచేశారు. జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు-నివారణ చర్యలు. దోమల ద్వారా మలేరియా, బోదవ్యాధి, డెంగీ, చికన్ గున్య, మెదడు వాపు ఇతర జ్వరాలు వ్యాపిస్తాయి. దోమ జీవిత చరిత్రలో గ్రుడ్డు, లార్యా, ప్యూపాలు నీళ్ళలో, పెద్ద దోమలు మాత్రమే గాలిలో పెరుగుతాయి. కాబట్టి నీటి సద్వినియోగం దోమల నియంత్రణలో ముఖ్యం. దోమ, పిల్ల పెరుగుదలను నివారించడం పెద్ద దోమల నియంత్రణ, దోమకాటు నుండి రక్షణ పొందడం, వ్యాధుల నిర్మూలనలోని ముఖ్యాంశాలు. మన ప్రాంతంలో సాధారణంగా 5 రకాల దోమలు పెరుగుతాయి. 1 ఈడిస్-ఇంటి లోపలి, ఇంటి బయటి పరిసరాల్లోని చిన్న చిన్న నీటి నిల్వలోల పెరిగి, డెంగీ, చికున్ గున్యా వ్యాధులు వ్యాప్తి చేస్తాయి. 2.అనాఫిలస్-మంచి నీటి నిల్వలో పెరిగి మలేరియా వ్యాధి వ్యాప్తి చేస్తాయి. మలేరియా జ్వరం వ్యాధిగ్రస్తమైన ఆడ అనాఫిలిస్ దోమకాటు వలన వ్యాపిస్తుంది ఈ వ్యాధి అన్ని వయస్సు వాళ్ళకి రావచ్చును. 3.కూలెక్స్-మురుగు నీటి నిల్వల్లో పెరిగి బోదవ్యాధి వ్యాప్తి చేస్తాయి. 5.అర్మిజరిస్-సెప్టిక్ ట్యాంకులు, పారిశ్రామిక వ్యర్థాలలో పెరుగుతాయి. నీటి ద్వారా ఏ విధమైన వ్యాధులు వ్యాప్తి చెందినప్పటికీ ఇవి పీల్చుకొనే రక్తం చాలా ఎక్కువ మోతాదులో ఉండి, తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ వారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు-నివారణ చర్యలు చేపట్టి ‘‘శుక్రవారం పొడి దినం’’ అనే నినాదంతో ప్రజలను దోమ నుండి కాపాడడానికి ఉద్దేశించిన ఒక ప్రచార కార్యక్రమం. అవగాహనతో ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక ప్రత్యేక నినాదం. వారంలో ఒక్క రోజు అంటే శుక్రవారం ఇల్లు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటిలో ఉన్ననాటి తొట్టేలు, సిమెంట్ కుండీలు, డ్రమ్ములలో ఉన్న నీటిని మొత్తం పారబోసి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తరువాత నీరు నింపుకోవాలి. దీని వల్ల ఈడిస్ దోమ జీవిత చక్రానికి అంతరాయం ఏర్పడుతుంది. లారావలు అంతరిస్తాయి. అన్ని రకాల దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. దోమల నియంత్రణ పద్ధతులు, దోమకాటు నుండి మనం లా కాపాడుకోవాలి? దోమల పెరుగుదల ఎక్కడ జరగుతుంది? పాఠశాల, అంగన్‌వాడి, హాస్టల్స్, కళాశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నియంత్రణ ప్రజల పాత్ర, దోమలకాటు నుండి మనం ఎలా కాపాడుకోవాలి? ‘‘చికిత్సకన్న నివారణ చాలా సులువు’’ ‘‘దోమలు పుట్టకుండ, కుట్టకుండా అన్న చర్యలు తీసుకోవాలని’’ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయిలోజాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణను 25 ఏప్రిల్ ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవము నిర్వహిస్తున్నారు. దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా చూద్దాం.

కొలనుపాక కుమారస్వామి,
సెల్: 9963720669, వరంగల్.