Warangalvoice

One can vote with 12 types of identity cards

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేయచ్చు

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి. ప్రావీణ్య
వరంగల్ వాయిస్, వరంగల్ : ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేకుంటే 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపెట్టి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిక్ కార్డు లేని వాళ్లు ఆధార్ కార్డు, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్.పి.ఆర్. కింద ఆర్ జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫొటోతో జారీ చేసిన ఐడీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడీ కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు (యూడీఐడీ)లలో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు. జిల్లా లో పట్టభద్రుల ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్ని పనులు ఉన్నా పోలింగ్ రోజు మే 27న సమయం కేటాయించి తమ ఓటు హక్కును విధిగా వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిని ఆ ప్రకటనలో కోరారు.

 

One can vote with 12 types of identity cards
One can vote with 12 types of identity cards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *