వరంగల్ వాయిస్,దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ వద్ద గల పెద్దపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి బి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి. సంజీవ రెడ్డి తెలుపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ
పెద్దాపుర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సిఈఓ గా పనిచేస్తున్న శ్రీనివాస్ విధుల పట్ల నిర్మక్ష్యం వహిస్తు ఎరువుల అమ్మకాల ద్వారా వచ్చిన రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా తన వద్దనే ఉంచుకున్న నేపథ్యంలో ఆయనను విదుల నుండి తొలగించినట్లు తెలిపారు. వరి ధాన్యం సేకరణ, రైతు ఉవృత్తి దారుల సంఘాలలో వాటాధనం, కొత్త సభ్యుల చేర్పించడం వంటి తదితర విషయాలపై నిర్లక్ష్యం వహించినందున సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.