
వరంగల్ వాయిస్, దామెర : మండలం ఓగులాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు మైనార్టీ గురుకుల పాఠశాల మహాత్మ జ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాలను తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సులను పరిశీలించి వాటి గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పాఠశాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ఒక చిట్టి పై రాసి ఫిర్యాదుల బాక్సులో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సమ్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ డేవిడ్, ఆర్ఐ భాస్కర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.