Warangalvoice

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్


దామెర మండలంలో మూడవ విడత ఏర్పాట్లపై సంతృప్తి
వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రధానంగా క్లస్టర్లలోని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.  దామెర, ల్యాదెళ్ల, ఒగులాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
ఈ కేంద్రంలో ఒగ్లాపూర్, దమ్మన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు  నామినేషన్లను స్వీకరిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. క్లస్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ నోటీస్, రిజర్వేషన్ల జాబితా లను ఆమె పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ గురించి ఆర్వోలు, ఏఆర్వోలతో మాట్లాడి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఎంపీడీవో కల్పన జిల్లా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలి.
కేంద్రాల వద్ద అధికారుల, సిబ్బంది, పోలీస్ భద్రత గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి ఎంపీడీవో గుమ్మడి కల్పన,  సీఐ రంజిత్ రావు ఎస్సై కొంక అశోక్,ఆర్ఐ సంపత్, ఎంపీ ఓ రంగాచారి,తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్యదర్శి ,ఇంజపెళ్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *