Warangalvoice

Hyderabad is a wonderful city

హైదరాబాద్‌ అద్భుత నగరం

  • ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం
  • హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్‌ విూడియా బృందం

వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్‌ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్‌, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్కై వేలు, అండర్‌ పాసులు, హరితహారంలను ఆసియాన్‌ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్‌ దేశాల విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి వసతులు, ఆతిధ్యం తమకు నచ్చినట్లు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ను తమ ఇండియా పర్యటన షెడ్యూల్‌లో భాగం చేసుకోవాలని యువతకు సూచించనున్నట్లు పేర్కొన్నారు. ఆసియాన్‌`ఇండియా విూడియా ఎక్చేంజ్‌ లో భాగంగా మియన్మార్‌, కాంభోడియ, వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, బ్రూనై , పిలిప్పీన్స్‌ , మలేసియా దేశాలకు చెందిన 17 మంది జర్నలిస్టుల బృందం తెలంగాణలో ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌ లోని పలు పారిశ్రామిక, చారిత్రక, వాణిజ్య ఆర్థిక సంస్థలను సందర్శించింది. ఆసియాన్‌ విూడియా పర్యటనను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయం చేసింది. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కు చెందిన పర్యాటక బస్‌ ద్వారా వాహన సదుపాయం కల్పించారు. ఆసియన్‌ సెక్రటేరియట్‌ కు చెందిన సీనియర్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఈ బృందం పర్యటించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పచ్చదనంతో ఆహ్లాదకరంగా వున్నదని పేర్కొన్నారు. బధదవారం తమ పర్యటనను ముగించుకుని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సింగపూర్‌ ద్వారా ఆసియన్‌ విూడియా ప్రతినిధులు ఆయా దేశాలకు తిరిగి వెళ్లారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆసియన్‌ విూడియా ప్రతినిధులను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు బి. రాజమౌళి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన వారికి వివరించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దుటకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతు న్నట్లు బి. రాజమౌళి వివరించారు. తమ పర్యటనలో భాగంగా శావిూర్‌పేటలో నాల్గవ యూత్‌ ఇండియన్‌ ఏషియన్‌ సమ్మిట్‌లో ఈ బృందం పాల్గొన్నది. సాలార్‌ జంగ్‌ మ్యూజియంను సందర్శించినది. భారత దేశంలోని రాజులు వినియోగించిన ఆయుధాలను, అలంకరణ , మెడిసిన్‌, గృహ వినియోగ నగిషీ వస్తువులను, పెయింటింగ్స్‌, శిల్పాలను వారు పరిశీలించినారు. ఆనాటి చారిత్రక జ్ఞాపకాలను పదిలప ర్చుటకు సాలార్‌ జంగ్‌ చూపిన చొరవను వారు ప్రశంసించారు. కొంతమంది చార్మినార్‌ను సందర్శిం చారు. భారత్‌ బయోటెక్‌ ను ఆసియన్‌ విూడియా సందర్శించినది .ఫార్మా రంగంలో హైదరాబాద్‌ సాధించిన ప్రగతిని, వ్యాధుల నియంత్రణకు తయారు చేస్తున్న వాక్సిన్ల గురించి తెలుసుకున్నారు. ప్రపంచ ఫార్మా కేంద్రంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందినట్లు అధికారులు వారికి వివరించారు. శిల్పారామంను సందర్శించి, పర్యటన గుర్తుగా కొన్ని వస్త్రాలను, అలంకరణ వస్తువులను విూడియా ప్రతినిధులు కొనుగోలు చేశారు.

Hyderabad is a wonderful city
Hyderabad is a wonderful city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *