వరంగల్ వాయిస్, హైదరాబాద్ : ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తల్లి రాపోలు రామలక్ష్మమ్మ ఇటీవల మరణించగా విషయం తెలుసుకున్న అసైన్డ్ భూమి సమితి (ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్ మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలకోటి మహేందర్ మాట్లాడుతూ రాపోలు రామలక్ష్మమ్మ అందించిన స్ఫూర్తితోనే ఆమె కుమారుడైన రాపోలు భాస్కర్ రెండు తెలుగు రాష్ట్రాలలో గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం, సలహాలు, సూచనలు చేస్తూ తమలాంటి న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. ఆమె లేని లోటు కుటుంబానికి తీరనిదని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి న్యాయవాది వేముల రమేష్, హనుమకొండకు చెందిన న్యాయవాది కొత్తపెల్లి చిరంజీవి, దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ తదితరులు పాల్గోన్నారు.
