వరంగల్ వాయిస్, హనుమకొండ : భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని న్యాయవాదుల సంఘం గ్రాడ్యుయేట్స్ కు విజ్ఞప్తి చేస్తుందని న్యాయవాదుల సంఘం రాష్ట్ర నాయకులు, భారత రాష్ట్ర సమితి, రాష్ట్ర సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ లీగల్ సేల్ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివరాజ్ కుమార్ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 34 నియోజకవర్గాల్లో పట్టభద్రులు ఆచితూచి ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఆరు నెలలలో ప్రజల వ్యతిరేకతను చూరగొందని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కేంద్ర పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు విఫలం అయ్యాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా 420 హామీలలో ఒకే ఒకటి ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏది కూడా నెరవేరలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం రైతుల నోట్లో మన్ను కొట్టిందని, నీళ్లు లేవు, కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు అయిన యువ నాయకుడు రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ సంఘం డిమాండ్ చేస్తుంది. రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమైంది. మెజారిటీ లక్ష్యంగా గ్రాడ్యుయేట్స్ పనిచేయాలని న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే ఉన్నత కంపెనీలో ఉద్యోగం సంపాదించి, తన రాష్ట్రానికి, జిల్లాకు, తన గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి విచ్చేసి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, మేధావి అయిన వ్యక్తికి పట్టభద్రులంతా పట్టం కట్టాలని అన్నారు. ఇందులో పార్టీ ఇంచార్జి నారదాసు లక్ష్మణ్, రంజిత్, వసంత్, ఉపాధ్యక్షులు శ్రీరామ్, కిరణ్ కుమార్, వేణు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
