మహిళాబిల్లు చారిత్రక అవసరమన్న కవిత వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ సాధించే వరకూ విశ్రమించేది లేదని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత వెళ్లడిరచారు. దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామన్నారు. జంతర్‌మంతర్‌లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని కవిత అన్నారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు. బీజేపీ బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతిస్తాయన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢల్లీిలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 18 పార్టీల ప్రతినిధులు సంఫీుభావం ప్రకటించారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంఫీుభావం తెలిపారు. 27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండిరగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండాలని చెప్పారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటులో బీజేపీకి పుల్ మెజార్టీ ఉందన్నారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్దపీట వేశారన్నారు. అమ్మానాన్న అంటారు.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుంది. రాజకీయాల్లో నూ మహిళకు సముచిత స్థానం దక్కాలని స్పష్టంచేశారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని చెప్పారు. అందువల్ల బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళాబిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని స్పష్టం చేశారు. ధరణిలో సగం, ఆకాశంలో సగం అనే తెలుగు నానుడి ఉన్నది. అందుకే అవకాశాల్లోనూ సగం కావాలని కోరుతున్నామని చెప్పారు. దీక్షకు మద్దతు తెలుపుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు చేయాలనే డిమాండ్ మహిళలందరిదని ధర్నాలో అన్నారు. మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. మ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బంజారాలకు స్వర్ణయుగమని చెప్పారు. బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని వెల్లడిరచారు. పార్లమెంటులో మెజార్టీ ఉన్న మోదీ సర్కార్ మహిళా బిల్లుపెట్టకపోవడం సిగ్గుచేటని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు.