హనుమకొండ పద్మాక్షి కాలనీలో..
వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ పద్మాక్షి కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ దేవాలయంలో బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ మారుతీ పరపతి సంఘం ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గంధతి సుధాకర్-కల్పన, అడపా కిరణ్-స్వాతి, గందే సాయిరాం-మాధురిలు కల్యాణంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ గందె కృష్ణ-భాగ్యలక్ష్మి, కనుకుంట్ల రవికుమార్-ఉమాదేవి, కరు దశరథ్ కుమార్-లలిత, మాదాసు మొగులయ్య-సరళ, అంబటి నరేందర్-అరుణ, గంట సత్యం-సీత, మారుతి పరపతి సంఘ కమిటీ మేఘా సింగ్, కాటి ఎల్లయ్య, దేవులపల్లి సంపత్, నట్వర్లాల్ పటేల్, హర్షం కృష్ణమూర్తి, ఆరుట్ల రామాచార్యులు, ఆలయ అర్చకులు, హనుమాన్ మూలాధారణ స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించినారు. భక్తులు తలంబ్రాలు వేసి తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు.
29వ డివిజన్ లో..
వరంగల్ వాయిస్, వరంగల్ : నగరంలోని 29వ డివిజన్ అబ్బయ్యపేట శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం శివపంచాయతన క్షేత్రం ఆవరణలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దాతల సహకారంతో శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కల్యాణ మహోత్సవం ఆలయ పూజారి కక్కిరేణి కృష్ణమూర్తి చేతుల మీదుగా కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు శ్రీరాముల సురేష్, పుప్పాల ధర్మ, కొరుపోదు లక్ష్మణ్, ఎంజాల రమేష్, ఆనంద్ మోహన్, బొమ్మల వెంకన్న, వాసం రమేష్, దుబ్యాల కృష్ణ, రాముల శ్రీనివాసు, బుచ్చిరాజు, రాచర్ల కుమార్, గో డిశాల వెంకన్న, సతీష్, గుండు కేదారి, రాజు, ఆలయ సిబ్బంది నవీన్ ప్రశాంత్ తదితరులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి శోభాయాత్ర పాపయ్యపేట, రామన్నపేటలో మేల తాళాలు, కోలాటంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని స్థానిక పెద్దలు తెలిపారు.