వరంగల్ వాయిస్, హనుమకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో గురువారం ములుగు రోడ్ దగ్గర ఉన్న స్వయంకృషి వృద్ధాశ్రమంలో వృద్దులకు సంచార వాహన వైద్య సేవల ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యుడు ఈవీ శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యుడు బిల్లా రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు ద్వారా బీపీ, షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో రెడ్ క్రాస్ డాక్టర్లు డా.జె.కిషన్ రావు, డా.టి.మదన్ మోహన్ రావు, బాబు రావు, సాంబయ్య, స్వయంకృషి ప్రెసిడెంట్ శుభ, భాగ్యమ్మ, అనిత, సుగుణ రాధా, అనూష, ప్రవిత, రమ, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, సాగర్, అనిల్, కె.రమేష్, రాజు వృద్దులు పాల్గొన్నారు.
