Warangalvoice

Rajdhani bus collided with scooty

స్కూటీని ఢీకొన్న రాజధాని బస్సు

  • మంటల్లో బస్సు, స్కూటీ దగ్ధం
  • ఘటనలో ఒకరు మృతి
    వరంగల్ వాయిస్,సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్‌ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న స్కూటీని ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు స్కూటీని ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. స్కూటీ, బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు. మృతుడు ఇందిరానగర్‌కు చెందిన రాజు(45)గా గుర్తించడం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రాజధాని బస్సు వెళుతోంది. మియాపూర్‌ డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర ఘటన జరిగింది. కాగా.. నిన్న ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న బస్సులో సైతం ప్రమాదం జరిగింది. వరుస ఘటనలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.. ప్రమాదంతో నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్‌`65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. కాగా ఈ ప్రమాదంలో బైక్‌ వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మతిచెందినట్టు వైద్యులు తెలిపారు
Rajdhani bus collided with scooty
Rajdhani bus collided with scooty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *