- వేదోక్తంగా భద్రాచలం సీతారామ కళ్యాణం
- అభిజిత్ లగ్నంలో కళ్యావేడుకలు
- పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి
- చినజీయర్ స్వామి, దత్తాత్రేయ స్పీకర్ తమ్మినేని హాజరు
వరంగల్ వాయిస్,భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండువగా సాగింది. కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువును వేదపండితులు నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామిఅమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్టాల్ర నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేసారు. జగదభిరాముని కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీమాన్నారయణ జీయర్ స్వామి దగ్గరుండి కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘట్టం జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో జగదాబిరాముడు, లోకపావని సీతాదేవి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగడంతో భక్తులు పులకించి పోయారు. రాములోరి కల్యాణ విశిష్టతతో పాటు, భద్రాద్రి ఆలయ చరిత్ర, వైభవాన్ని భక్తులకు వేద పండితులు వివరించారు. భద్రాచలం ఆలయం ఆరుబయట మిథిలా స్టేడియంలో కల్యాణ వేడుక ఏటా జరిగినట్లే జరిగింది. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియంతో పాటు, భద్రాద్రి పుర వీధులు మార్మోగాయి. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయడంతో భక్తులు రామనామంతో పులకించారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారి కల్యాణానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణానికి వచ్చే భక్తులతో భద్రాద్రి కిక్కిరిసి పోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. వేలాదిమంది కూర్చిని వీక్షించేలా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ఫ్రీగా మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపినీ చేసారు. ఉదయం 9.30 గంటలకు కల్యాణ మూర్తులను వేద మంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుంచి కల్యాణ తంతు ప్రారంభం అయింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహుర్తాన కల్యాణ మహోత్సవం జరిగింది.
