వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన శీలం ప్రవీణ్ అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న విషయం స్థానిక నాయకులు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయ నిధి నుంచి రూ. లక్ష మంజూరు చేయించి గురువారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి ఆనంద్ శారద, చెన్న ప్రకాష్, ఎర్రోజు భాస్కర్, దూల్ పేట రాజు, పానుగంటి శ్రీధర్, కేదారి మధు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
