వరంగల్ వాయిస్, హైదరాబాద్ : భారత టెన్నిస్ దిగ్గజం సానియా విూర్జా రిటైర్మెంట్ ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్ టెన్నిస్ అసోసియేషన్) టోర్నీతో తన కెరీర్ కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం కాబోయే ఆస్టేల్రియా ఓపెన్ కు సన్నధం అవుతుంది. తర్వాత దుబాయ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడే తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తుంది. గతేడాది ఆటనుంచి తప్పుకోవాలని అనుకున్నా.. కొన్ని కారణాలవల్ల తర్వాత తన మనసు మార్చుకుంది. పోయిన ఏడాది యూఎస్ ఓపెన్ ఆడి ఆటకు గుడబై చెప్పాలనుకుంది. కానీ, గాయం కారణంగా టోర్నీకి దూరం అయింది. దాంతో రిటైర్మెంట్ వాయిదా పడిరది. ’గాయంతో కెరీర్ ముగించుకోవాలి అనుకోలేదు. అందుకే రిటైర్మెంట్ ని పోస్ట్ పోన్ చేశా’ అని సానియా అన్నది.
