Warangalvoice

The arrival of saints is joyful

సాధుసంతులు రావడం ఆనందందాయకం

  • నందిపేట్‌ మహాసభల్లో కవిత వెల్లడి
  • కెసిఆర్‌ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేశారన్న జీవన్‌ రెడ్డి

వరంగల్ వాయిస్, నిజామాబాద్‌:నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్‌ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాధు పరిషత్‌ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్మూర్‌ కు ప్రత్యేక చరిత్ర ఉందన్న కవిత… నవనాధ సాధుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం నవ సిద్ధుల గుట్ట అని చెప్పారు. దేశవ్యాప్తంగా గా ఉన్న సనాతన ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడు కున్నందునే దేశం గొప్ప స్థాయిలో ఉందని గర్వంగా చెప్పారు. వితండవాదాలను ఎదుర్కొంటూ మన ధర్మాన్ని కాపాడుతున్నామంటే అది సాదు సంతుల గొప్పతనమని ప్రశంసించారు. తెలంగాణలో ధర్మ రక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు, అండదండలు అందిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. దేశంలో అందరూ సోదరభావంతో మెలుగుతూ విశ్వ గురువుగా ఎదగాలని కోరుతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత జాతిని ముందుకు నడపాలని సాదు సంతులను వేడుకుంటున్నానని అన్నారు. ఆర్మూర్‌ ప్రజలు అదృష్ట వంతులని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. 150 మంది పీఠాధిపతులు ఇక్కడికి రావటం తమ అదృష్టమన్న ఆయన.. మంగి రాములు మహారాజ్‌ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ఇక్కడి ప్రజలకు ఒక దేవుడిలా మారారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్టం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంద న్నారు. అన్ని ఆలయాల్లో దీప,ధూప, నైవేద్యాలకు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు.. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ జరగాలని, పీఠాధిపతులు ఆశీర్వదించాలని కోరుతున్నామని జీవన్‌ రెడ్డి అన్నారు. ఈ క్షేత్రంలో త్వరలో కంటి వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణెళి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నదన్నారు. కేసీఆర్‌ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసే కార్యాక్రమాలు చేపట్టారన్నారు. ధ్యాత్మిక రాజధానిగా రూ.2వేల కోట్లతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి కేసీఆర్‌ గారు చరిత్ర సృష్టించారని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్‌ లో 500 కోట్లు కేటాయింపులు చేయడమే కాక ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్‌ గారని ఆయన అన్నారు. ఆర్మూర్‌ గొప్ప దైవచింతన కలిగిన నేల. ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా పరమశివుడి దివ్యక్షేత్రంగా సిద్ధులగుట్ట భక్తకోటిని పరవశింపజేస్తోంది. పురాతన కాలంలో 9మంది సిద్ధులు తపస్సు చేసిన ఫలితంగా ఈ పుణ్యక్షేత్రం నవనాధ సిద్ధులగుట్టగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడి దివ్యఆలయంతో పాటు శివలింగం కలిగిన గుహ ఉండడం సిద్ధులగుట్ట ప్రత్యేకత. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించి ఇప్పటికే రూ.20కోట్లతో ఘాట్‌ రోడ్డు వేయించాం. సిద్ధులగుట్ట పై మరెన్నో నిర్మాణాలు చేపట్టాం. మహాపీఠాధిపతులు, సాధువులు ఈ మహాసభలు ముగిసిన తరువాత సిద్ధులగుట్ట శివయ్యను తప్పకుండా దర్శించుకోవాలని ఆర్థిస్తున్నా. భక్తులకు కొంగు బంగారం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమం. 34ఏండ్ల కిందట నిజామాబాద్‌ నగరం శ్రద్దానంద్‌ గంజ్‌ లో సాధూ పరిషత్‌ మహాసభలు జరిగినట్లు పెద్దలు చెప్పారు. ఇన్నాళ్ల తరువాత ఈ మహోన్నతమైన ఆధ్యాత్మిక మహాసభలు మా ప్రాంతంలో జరుగుతుండటం ప్రజల అదృష్టం. దేశం నలుమూలల నుంచి 150 మంది పీఠాధిపతులు, సాధువులు మా నేల పై కాలు మోపడం మాకు శుభసూచకం అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసేలా సాగే ప్రవచనాలు, ధర్మబోధనలు విని భక్తులు తరించాలి. దేశమంతా తెలంగాణ మోడల్‌ అమలు కావాలని మహా పీఠాధిపతులు, సాధువులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి ఆశీర్వచనాలు అందించాలి’ అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కేదారేశ్వరాశ్రమ కర్మ, కర్త, క్రియ అయిన శ్రీ మంగి రాములు మహారాజ్‌ ప్రజలకు దేవుడితో సమానమన్నారు. దైవదూతగా, ప్రజాసేవకుడుగా, నిత్య అన్నదాన కర్తగా ఆయన లక్షలాది మంది భక్తుల అభిమానం పొందారన్నారు. ఇదిలావుండగా కేదారేశ్వరాశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటా మన్నారు. ఆశ్రమ అభివృద్ధికి భూమి కేటాయించామని, కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆశ్రమంతో పాటు సిద్ధులగుట్ట అభివృద్ధికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. కేదారేశ్వరాశ్రమంలో కంటి ఆసుపత్రి నిర్మిస్తామని, కేసీఆర్‌ ఆశీస్సులతో, కవితక్క సహకారంతో త్వరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి అందరికీ ఉచిత నేత్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తానని జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు.

The arrival of saints is joyful
The arrival of saints is joyful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *