వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : అమావాస్యను పురస్కరించుకొని గురువారం రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ మహాదేవ స్వామి దేవాలయంలో శివుడికి, గణపతికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ ప్రధాన పూజారి పిండిపోలు శ్రీనివాస్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ కూరెళ్ల పెద్ద ఉపేందర్ గుప్తా-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. గోలి శంకరయ్య-లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు గోలి వీరన్న-రజిత, అల్లుళ్లు అంజయ్య-వీరమణి, కూరేళ్ల ఉపేందర్-రేణుక దంపతుల ఆధ్వర్యంలో ప్రజలకు భక్తులకు అన్నదానం చేశారు. గందె బుచ్చయ్య విజయలక్ష్మిల జ్ఞాపకార్థం వారి కుమారుడు గందె మంజుల శ్రవణ్ కుమార్ స్వీట్ ను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ ప్రతినెల అమావాస్య రోజున ఆలయంలో పూజలు, అర్చనలు, అభిషేకాలు, అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు అంబాటి రాంబాబు నేత, ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణమూర్తి నేత, వేద కుమార్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
