వరంగల్ వాయిస్, శాయంపేట : మండల కేంద్రంలోనీ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, చైర్మన్ సామల భిక్షపతి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహూకరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల అధికార ప్రతినిధి చిందం రవి, మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ వై నాలా కుమారస్వామి, జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, మోత్కూరి భాస్కర్, వలుపదాసు రాము, మాదిరెడ్డి ప్రపంచరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
