Warangalvoice

Be happy with the blessings of Lord Rama..

శ్రీరాముడి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి..

వరంగల్ వాయిస్, స్టేషన్ ఘనపూర్ : మండలం తాటికొండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చిల్పూరు మండలం నష్కల్ లో శ్రీరామనవమి పురస్కరించుకొని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాలలోని శ్రీ సీత రామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులు, చిన్నారులతో మమేకమై వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య వారిని ఆప్యాయంగా పలకరించారు.

kadiyam2 kadiyam3 Be happy with the blessings of Lord Rama..

కనకదుర్గ మాత దేవాలయంలో..
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : సీతారాముల కళ్యాణం సందర్భంగా నర్సంపేటలో రోడ్ లోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయము లో సీతారాముల కల్యాణం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యతో తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం భక్తులకు నవీన్ దంపతుల ఆధ్వర్యంలో పులిహోర పంచారు. ఆలయ కమిటీ సభ్యులు సింగిరికొండ వెంకటేశ్వర్లు, సర్వారియ సురేష్ కుమార్, పప్పు వేణు, కొంక వెంకటేశ్వరరావు, కొప్పుల చంద్రశేఖర్, గూడ శారద, భక్తులు పాల్గొన్నారు.

Be happy with the blessings of Lord Rama..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *