Warangalvoice

Corporator who started Shravana Masotsavam

శ్రావణ మాసోత్సవాలను ప్రారంభించిన కార్పొరేటర్


వరంగల్ వాయిస్, వరంగల్ : శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్ నందు శ్రావణ మాసోత్సవాలను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిమాన్వితమైన జిల్లాలోనే ప్రత్యేకంగా నర్మదాబాణ లింగం, అన్నపూర్ణ మాత భద్రకాళీ వీరభద్ర స్వామిలతో కూడిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతాయని భక్తులు పాల్గొనాలని పిలుపిచ్చారు. అర్చకులు తనుగుల రత్నాకర్ అయ్యగారు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేయించారు. అనంతరం అన్నపూర్ణ దేవికి ప్రత్యేక అలంకారం అర్చనలు చేశారు. శ్రాణమాసం మొదటి రోజే శుక్రవారం కావడంతో మహిళా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. భక్తులకు ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అప్పరాజు రాజు, సభ్యులు చిట్టిమళ్ళ సురేష్, కటకం రాములు, పప్పుల మంజుల, గంగిశెట్టి హరినాథ్ స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *