Warangalvoice

Sankranti celebrations in Shilparam

శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

  • రెండురోజుల పాటు భారీగా తరలివచ్చిన నగర వాసులు
  • ఆక్టుటకున్న బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు

వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: పల్లె సొగసులు… ప్రకృతి అందాలతో నగర ప్రజలకు ఓ గ్రావిూణ ప్రాంతంగా ఆకట్టుకుంటున్న శిల్పారామంలో సంక్రాంతి సందడి నగరవాసులను ఆకట్టుకుంది. పల్లెలకు వెళ్లలేకపోయిన పట్టణవాసులు సంక్రాంతి వేడుకలను ఇక్కడ ఆస్వాదించారు. భోగిమంటలు, రంగురంగుల రంగవల్లికలతో శిల్పారామం స్వాగతం పలుకింది. బసవన్నల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలతో సందడి సందడిగా మారింది. సోమ,మంగళవారాల్లో శిల్పారామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి వరకు గంగిరెద్దు విన్యాసాలు హైలెట్‌గా నిలిచాయి., ఓ పక్క నగర వాసులు పల్లెటూర్లకు బయల్దేరి వెళ్లారు. దీంతో నగరంలో ఉన్న ప్రలకు శిల్పారామం సంక్రాంతి సంబరాలను చేరువ చేసింది. నగరంలో ఉండే తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడేందుకు శిల్పారామం సొసైటీ వారు పల్లెవాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకృతి పర్యావరణ, సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన శిల్పారామంలో ఉదయం 11గంటల నుంచి గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల సంకీర్తనలు, బుడగ దేవర నృత్యాలు, బుడబుక్కల వేషధారణలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మెదక్‌, రంగారెడ్డి జిల్లాల కళాకారులు గంగిరెద్దులతో పలు విన్యాసాలు చేయించి సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి ముగ్గులు అందరి మనస్సులు దోచుకున్నాయి. భారీగా పిల్లా పాపలతో తరలిచ్చిన ప్రజలు ఎంజాయ్‌ చేశారు. నగరం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులతో శిల్పారామం కిటకిటలాడిరది. శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి సందర్భంగా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో సైబర్‌టవర్‌ నుంచి హైటెక్స్‌ కమాన్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్కు చేశారు. దీంతో శిల్పారామంలో ఎక్కడిక్కడే వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డారు. హైటెక్‌ సిటీలోని శిల్పారామానికి జనాలు క్యూ కట్టారు. శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. పల్లె వాతావరణంతో అక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా
నిలుస్తున్నాయి. పండగ ప్రత్యేకతలు పిల్లలకు తెలిసేలా కార్యక్రమాలు రూపొందించారు. వీటిని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యాయి. శిల్పారామానికి వచ్చి వెళ్లే రూట్లలో కిలో విూటరు కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ నగరంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. సంక్రాంతి సంబురాల్లో భాగంగా శిల్పారామంలో గంగిరెద్దుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కూచిపూడి, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాస్‌ కీర్తనలతో నగరంలోని శిల్పారామం మార్మోగిపోయింది. సంక్రాంతి వేడుకల్లో పాల్గొని.. సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో శిల్పారామానికి తరలివచ్చారు. వినీలాకాశంలో రివ్వున ఎగిరే పతంగులు గల్లీల్లోనూ ఎగిరాయి.

Sankranti celebrations in Shilparam
Sankranti celebrations in Shilparam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *