- వేదిక శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం
- భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు
- అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగిన దేవాలయం
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని పెడపల్లి డబ్బాల క్రాస్ వద్దగల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ కాసాంజనేయ స్వామి అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో రెండో సామూహిక పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గురు స్వామి జానకి రామయ్య ఆధ్వర్యంలో పడిపూజను వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి భజనలు చేసి స్వామి వారి పడిపూజలో సందడి చేశారు. అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పడిపూజ అనంతరం స్వాములకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పడిపూజలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులు, అయప్ప స్వాములకు, సేవ చేసిన వారికి కమిటీ గౌరవ అధ్యక్షుడు దండబోయిన శ్రీకాంత్, అధ్యక్షుడు చాగంటి రాజు, ఉపాధ్యక్షులు గుంటి కమలాకర్, నీలం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు సోమ కనకయ్, సీతా గణేష్, కోశాధికారులుగా అనిశెట్టి రజనీకాంత్, చిర్ర ప్రవీణ్ కుమార్ గౌడ్, ఆర్గనైజేషన్ కార్యదర్శులు దుంపల మధు, కొత్త వినయ్ కుమార్, దుబ్యాల శ్రీనాథ్, దుబ్యాల హరికృష్ణ, కనకరాజు, ఆర్గనైజర్లు కొండ గూడూరు రామకృష్ణ, కందారపు రాజు, ఆలేటి శ్రీనివాస్, దొరికిన విజేందర్, కోడిపాక బాబురావు, బైన సంతోష్, దుంపల కృష్ణ, పున్నం జగన్, దుండ అజయ్ వర్మ, ఉప్పుల రాజు పటేల్, గండ్రతి నిరంజన్ పటేల్ లు ధన్యవాదాలు తెలిపారు.