వరంగల్ వాయిస్, హనుమకొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొబైల్ మెడికేర్ యూనిట్, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హసన్ పర్తి మండలం, పలివేల్పుల రోడ్డు, భీమారం గ్రామంలోని లార్డ్ అనాథ వృద్ధాశ్రమంలో వృద్దులకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్ : పెద్ది వెంకట నారాయణ గౌడ్, కోశాధికారి : బొమ్మినేని పాపిరెడ్డిల ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా పాలకవర్గం మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు హనుమకొండ రెడ్ క్రాస్ సంచార వైద్యశాల సేవలు ద్వారా బిపి. షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగిందని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరంలో నారగోయినా నరేష్ గౌడ్, రెడ్ క్రాస్ డాక్టర్లు : డా. జె.కిషన్ రావు, డా.మొహమ్మద్ తాహెర్ మసూద్, రెడ్ క్రాస్ సిబ్బంది గుల్లెపెల్లి శివకుమార్, ఉపేందర్, అనిల్, నర్సింహా చారి, పోశాలు, వృద్ధులు పాల్గొన్నారు.
