Warangalvoice

SAVE 20220723 022509

వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ
ఇద్దరు దొంగల అరెస్ట్

నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిమీద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు లక్ష పదివేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంతో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ నగరంలోని బి.ఆర్ నగర్ కు చెందిన అజారుద్దీన్, ఓరుగంటి రాజు ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు బాల్య స్నేహితులు. ఇద్దరూ చదువు మధ్యలో అపివేసి ఎలక్ట్రిషన్ గా పనిచేసేవారు. దీని ద్వారా వీరికి వచ్చే అదాయంతో పాటు అప్పులు చేసి మద్యం తాగుతూ, జల్సాలు చేసేవారు. దీంతో వీరికి అప్పులు అధికం కావడంతో పాటు వీరి జల్సాలకు డబ్బు లభించకపోవడంతో సులువు డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగం వీరి ప్రాంతంలోనే ఒంటరి నివసిస్తున్న వృద్ధురాలి ఒంటిపై వున్న బంగారు గొలుసుపై నిందితుల దృష్టి పడింది. ముఖ్యంగా సదరు వృద్ధురాలికి కంటిచూపుతో పాటు, వినికిడి లోపంకూడా వుండడంతో బంగారు గొలుసును చోరీ చేసేందుకు సిద్ధమయ్యారు. దోపిడీ చేసే ప్రక్రియ లో నిందితులు ముందుగా వృద్ధురాలి ఇంటి పరిసరాలపై రెక్కీ నిర్వహించారు. అనంతరం ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి సమయంలో వృద్ధురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా తలుపులు తోసి ఇంటిలోకి చొరబడి నిద్రిస్తున్న ఆమెపై దాడి చేసి పుస్తెల తాడు చోరీ చేసి ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న మీల్స్ కాలనీ పోలీసులు క్రైమ్స్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి అదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఉర్సు గుట్ట బ్రిడ్జ్ పై వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చోరీ సొత్తును బంగారం మార్కెట్ లో అమ్మేందుకుగా ద్వి చక్రవాహనంపై వస్తున్న నిందితులను పోలీసులు అపి తనిఖీ చేయగా నిందితుల వద్ద బంగారు గొలుసును గుర్తించి అదుపులో తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ట్రాఫిక్ అండ్ క్రైమ్స్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, క్రైమ్స్ ఏసీపీ డేవిడ్ రాజు, సీసీఎస్ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఎస్.ఐలు సంపత్ కుమార్, యాదగిరి, ఏఏఓ సల్మాన్ పాషా, ఏఎస్.ఐ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ మహ్మమద్ ఆలీ, కానిస్టేబుల్లు చంద్రశేఖర్, నజీరుద్దీన్ మీ కాలనీ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

SAVE 20220723 022509

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *