వరంగల్ వాయిస్, కాజీపేట : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో వీఆర్ఏల జాక్ తో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. పే స్కేల్ ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని దుయ్యపట్టారు. సమ్మెలో పాల్గొన్న బీజేపీ నాయకులు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు చిల్లర నర్సింగ్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ చాంద్ పాషా, 2వ డివిజన్ అధ్యక్షుడు భగవాన్ దాస్ ఉపాధ్యాయ, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోవెల జీవన్, ప్రకాష్, జయంతి లాల్, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు కందకట్ల సత్యనారాయణ, గుంటి కుమార్ స్వామి, ఆర్ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రవణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
