వరంగల్ వాయిస్, హనుమకొండ : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కల్లూరి పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా శనివారం పవన్ మాట్లాడుతూ వీఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కింది స్థాయి ఉద్యోగులుగా పని చేస్తున్నారని, ప్రభుత్వం ప్రవేశ పెట్టె ప్రతి సంక్షేమ పధకాన్ని అమలు చేసే క్రమంలో పగలు, రాత్రి అని తేడా లేకుండా పని చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ వీఆర్ ఏలు కూడా గౌరవంగా బ్రతకాలని, వారికి కూడా పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వక పోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించే వరకు జాతీయ బీసీ యువజన సంఘం పోరాడుతుందని అన్నారు.
