వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన దీక్షకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలన్నారు. అలాగే మిగతా వారి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ పరకాల మండల అధ్యక్షుడు సూర రాజు, ఉపాధ్యక్షుడు ఓట్ల స్వాతి, కార్యదర్శి అశోక్, రాకేష్, రామకృష్ణ, రవీందర్, శైలజ, తిరుపతి, సాంబయ్య, దేవి, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
