వరంగల్ వాయిస్, నర్సంపేట : వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వీఆర్వో సంఘం సంఘీభావం తెలుపారు. సమ్మెను ఉద్దెశించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు న్యాయమైనవి, వారికి పే స్కేల్ జీవో వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ల సంఘం నాయకులు రాజేందర్, రాజు, నర్సింహస్వామి, వీఆర్ఏల జేఏసీ చైర్మన్ బిర్రు సునిల్, వీఆర్ఏలు పాల్గొన్నారు పాల్గొన్నారు.
