శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్ర పుష్పాలతో ముగిసింది. అమ్మవారిని విరోధినీమాతగా షోడశీ క్రమాన్ని అనుసరించి వహ్నివాసినిగాను అలంకారం జరిపి పూజారాధనలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆలయాన్ని సందర్శించారు.
-వరంగల్ వాయిస్, కల్చరల్
