- భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుడు , విప్లవ యోధుడు
- వీర సావర్కర్ జయంతి మే 28న
స్వాతంత్ర సమరసినాని సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరంలో ఒక ప్రభంజనం. సావర్కర్ విద్యార్థి దశ నుండి అర్థవంతమైన జీవితాన్ని ఆరంభించారు. విప్లవకారులు శాపేకర్ సోదరుల్ని బ్రిటిష్ వారు ఉరి తీశారన్న వార్త విన్న చిరుప్రాయంలోని సావర్కర్ చలించిపోయారు. వినాయక్ దామోదర్ సావర్కర్ కు స్వాతంత్ర సంగ్రామంలో 50 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. అండమాన్ దీవుల్లో ని కారాగారంలో ఆయన దుర్భర జీవితం గడుపుతున్నప్పటికీ తోటి ఖైదీలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతిఘటించటానికి వారిని సంఘటిత పరిచి సమ్మెలు నిర్వహింప చేశారు. జైల్లో ఆయన అనారోగ్యంగా ఉన్నా అధికారులు చిత్రహింసలు పెట్టడం మానలేదు. రాసుకోవడానికి కాగితాలు ఇవ్వకపోయినా సావర్కర్ తనకు దొరికిన కాలి బూటు మేకులతో గోడలపై కవిత్వాలు రాశారు. ఆ రచనలో ఆయన రాబోయే దేశ పరిణామాల మీద స్పష్టంగా చేసిన వ్యాఖ్యల గురించి మరువలేము. సావర్కర్ కు వ్యక్తిగత జీవితం ఉన్నది. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె. వారి యోగక్షేమాల గురించి ఆయన శ్రద్ధ తీసుకున్నారు. కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఉన్నాయి. అయితే ఆయన సంసార జీవితం ఆదర్శాలకు ఆటంకం కాలేదు దేశమాత బంధాల విముక్తి పోరాటంలో తన కర్తవ్యాన్ని వీడలేదు. మరణం సంభవిస్తుందని భయంతో పోరాటానికి వెనుకాడని దీశాలి సావర్కర్. భార్యా పిల్లలు తనను అమరునిగా పరిగణించాలని ఒకవేళ తన భార్యకు భర్త వియోగంతో జీవించడం ఇష్టం లేకపోతే ఆమె మరొకరిని వివాహం చేసుకొని నూతన జీవితం కొనసాగించవచ్చునని భావించిన ఆదర్శవాది సావర్కర్.
సావర్కర్ భారతదేశం అంతట పర్యటించారు. ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు ఇచ్చారు. అనేక సాంఘిక రాజకీయ రంగాలు రెండింటిలోనూ ఆయన కృషి చేశారు. బ్రిటిష్ వారి ఎత్తుగడలు కాంగ్రెస్ నాయకుల తప్పటడుగుల గురించి హెచ్చరించారు. హిందువుని పిలవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో హిందుత్వం అన్న గ్రంథాన్ని రాసి హిందుత్వం ఏవిధంగా అనే ఐదు వందల వేల సంవత్సరాల నుండి పరీక్షలకు తట్టుకుని వికసించిందో వివరించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. ఆనాటి వారి హిందూ పదం నిర్వచనాన్ని నేడు అందరూ అంగీకరిస్తున్నారు. 1905 లో మహాత్మా గాంధీ ఉద్యమానికి ముందే విదేశీ వస్త్ర వస్తూ బహిష్కరణకు పూణేలో చేసిన ఉపన్యాసం తో ఆ నగరవాసులు విదేశీ వస్త్రాలకు పరుస్తూ రామ ప్రీతి జరిపించారు. సావర్కర్ దళితుల దేవాలయ ప్రవేశాన్ని ప్రోత్సహించారు. ఎక్కడికి వెళ్లినా దళితుల ఇళ్లలో బస చేసేవారు. వినాయక్ దామోదర్ సావర్కర్ ఆయన పూర్తి పేరు. ఆయన వక్త రచయిత సంఘసంస్కర్త కవి చరిత్రకారుడు పత్రికా రచయిత.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో 1883 మే 28న వీర సావర్కర్ జన్మించారు. పూణేలోని ఫెర్గుసన్ కాలేజీలో చదువుతున్నప్పుడే సమితి నెలకొల్పాడు. 1904లో 200 మంది విద్యార్థులతో అభినవ భారత్ అనే విప్లవ సంస్థ స్థాపించాడు. 1905లో ఇలా చదువుతున్న సావర్కర్ ని మహారాష్ట్రలో స్వాతంత్రోద్యమ నాయకునిగా గుర్తించారు లండన్ లో ఉండి ఇండియా స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తున్న శ్యాంజి కృష్ణ వర్మ ఇచ్చిన స్కాలర్షిప్ తో సావర్కర్ ఇంగ్లాండ్లో బారిష్టర్ చదువు కోసం వెళ్ళాడు. సావర్కర్ కార్యదీక్ష శ్యాంజీని ఆకర్షించగా ఆయన కూడా అభినవభారతిలో చేరాడు. తరువాత సావర్కర్ లండన్ లో ఫ్రీ ఇండియా సొసైటీ స్థాపించి దాని ద్వారా అభినవ భారత్కు సభ్యులను చేర్పించ సాగారు. అప్పట్లో లండన్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 1857లో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం కేవలం సిపాయిల పితూరిగా చిత్రించి ఆ పితుూరిలో తమ విజయ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్నది. దీనికి పోటీగా లండన్ లోనే వీర సావర్కర్ 1857 ప్రధమ భారత స్వాతంత్ర్య సమరం స్వర్ణోత్సవాలు జరిపించారు. ఆ తర్వాత ఆయన ప్రథమ భారత స్వాతంత్ర సమర గంధం రచించారు. ఆ గ్రంథ ముద్రణకు బ్రిటిష్ ప్రభుత్వం అవరోధాలు కల్పించగా హాలండ్లో ముద్రింప చేసి మరో పేరున కవర్లలో దాని ప్రతులు ఇండియాకు పంపారు. సావర్కర్ చర్యలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆందోళనపరిచాయి. దురదృష్టవశాత్తు ఆయనను మహాత్మా గాంధీ హత్యాభియోగంలో నిందితునిగా చేర్చారు. అయితే ప్రత్యేక న్యాయమూర్తి ఆత్మచరణ్ ఆయన నిర్దోషి అని విడుదల చేశారు. కోర్టులో సావర్కర్ సమాధానమిస్తూ నేను దేశభక్తుడినే స్వాతంత్రోద్యమంలో నా యావదాస్తిని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
మహాత్మా గాంధీ హత్యను ప్రోత్సహించే అంతటి నికృష్టుడినా అని కన్నీరు కార్చాడట. గాంధీజీ హత్యలో సావర్కర్ కు సంబంధం లేదని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసించింది. 1970లో ఆ దేశభక్తుడి స్మృత్యర్థం తపాలా బిల్లా విడుదల చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్ చిత్రాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆవిష్కరించాలని ప్రత్యేక కమిటీ 2002 డిసెంబర్ 5న చేసిన తీర్మానంలో కాంగ్రెస్ నేతలు శివరాజ్ పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, సిపిఎం నాయకుడు సోమనాథ్ చటర్జీ భాగస్వాములు. వీర సావర్కర్ చిత్రపటాన్ని ఆయన 37వ వర్ధంతి దినోత్సవమైన ఫిబ్రవరి 26, 2003న భారత పార్లమెంటు సెంట్రల్ హాలులో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆవిష్కరించడం సమచితం. ఆయన జీవితంలోని ఆసక్తికర అంశాలను జ్ఞాపకం చేసుకోవడం అవసరం.
(1883-1968)
కొలనుపాక కుమారస్వామి, వరంగల్
మొబైల్ : 9963720669