వరంగల్ వాయిస్, వెంకటాపూర్ : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో విద్యుత్ షాకుతో దుక్కిటేద్దు మృతి చెందింది. రైతు హట్కర్ రూపు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఎద్దు రాకపోవడంతో చుట్టు పరిసరాలలో పరిశీలించగా, విద్యుత్ షాక్ తో ఎద్దు మృతిచెంది ఉందని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన ఎద్దు విలువ 50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు పరిశీలించి పంచనామా చేశారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను కోరారు.
