Warangalvoice

Electrical Jobs Chalo Vidyut Soudha

విద్యుత్‌ ఉద్యోగలు ఛలో విద్యుత్‌ సౌధ

  • డిమాండ్ల సాధన కోసం ఆందోళన
  • ఖైరాతాబాద్‌ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్‌

వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. ధర్నాలో 30వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు 29 డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌, పంజాగుట్ట మార్గం మూసివేశారు. దీంతో 4 కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ’ఛలో విద్యుత్‌ సౌధ’ పిలుపునకు ఉద్యోగుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా ఆందోళనలో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంతగా విద్యుత్‌ సౌధ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. స్టాండిరగ్‌ ఆర్డర్స్‌ రద్దు చేయాలని, వేతన సవరణ, ఆర్జిజన్‌ సమస్యలు, ఈపీఎఫ్‌ స్థానంలో జీపీఎఫ్‌ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు విద్యుత్‌ సౌధాలో మహాధర్నా నిర్వహించారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలంటూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన ఛలో విద్యుత్‌ సౌధ పిలుపు మేరకు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధకు పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు.. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరకంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ ఉద్యోగుల ధర్నాతో విద్యుత్‌ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. ఖైరతాబాద్‌ `పంజాగుట్ట రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్‌ ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

Electrical Jobs Chalo Vidyut Soudha
Electrical Jobs Chalo Vidyut Soudha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *