వరంగల్ వాయిస్, హనుమకొండ: పాఠశాల విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు, కౌమారవిద్యను నేర్పించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ కు ఓరుగల్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ , సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మంగళవారం వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహవిద్యాకార్యక్రమాలు గతంలో వలె జరుగడం లేదని, విద్యాలయాల్లో విద్యతో పాటు దేశభక్తి, సామాజిక, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించేవిధంగా ఉండాలని, అందుకనుగుణమైన పాఠ్యప్రణాళిక, ఉపాధ్యాయుల కాలనిర్ణయపట్టిక ఉండాలని కోరామన్నారు. పాఠశాలల్లో కన్స్యూమర్స్ క్లబ్బుల ఏర్పాటు, పర్యావరణం, స్వచ్ఛ భారత్, తెలంగాణ హరితహారం, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించేవిధంగా సహవిద్యాకార్యక్రమాలు ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ను కలిసినవారిలో కజాంపురం దామోదర్, తేరాల యుగంధర్, కొండబత్తిని రాజేందర్, పరికిపండ్ల వేణు, గంటి సాంబయ్య, వర్ధెల్లి మలహాల్ రావు, నరసింహారావు, గోకారపురాజేందర్ తదితరులు ఉన్నారు.
